బెజవాడలో దారుణం.. ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు!

విజయవాడలో కలకలం రేపిన దారుణ ఘటన. ఒక యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం అదే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో విభేదాలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

బెజవాడలో దారుణం.. ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు!
Vijayawada Crime

Updated on: Oct 03, 2026 | 12:12 PM

విజయవాడ: బెజవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి పీక కోసిన ఘటన కలకలం రేపింది. అనంతరం అదే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడిని చిన్నగా, యువతిని మహాలక్ష్మిగా గుర్తించారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ముందుగా యువతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన చిన్న.. అనంతరం భవనం పైకి వెళ్లి కిందకు దూకినట్లు సమాచారం. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు చిన్న మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. యువతి కోలుకుంటే ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో విభేదాలే ఘటనకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us