తెలుగుతమ్ముళ్లు సెకండ్ రౌండ్, పరాభవం నుంచి అధినేత తేరుకోకముందే మళ్లీ షాకుమీద షాకిలివ్వడం షురూ

|

Feb 28, 2021 | 4:51 PM

పంచాయతీ ఫలితాల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకోక ముందే టీడీపీకి మున్సిపల్‌ పోరులో తమ్ముళ్లు షాకిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలోని..

తెలుగుతమ్ముళ్లు సెకండ్ రౌండ్,  పరాభవం నుంచి అధినేత తేరుకోకముందే మళ్లీ షాకుమీద షాకిలివ్వడం షురూ
Follow us on

పంచాయతీ ఫలితాల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకోక ముందే టీడీపీకి మున్సిపల్‌ పోరులో తమ్ముళ్లు షాకిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థులు ఫ్యాన్‌ కిందకు చేరడం ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. మేం బి ఫామ్స్ ఇస్తే… వేరే పార్టీలో చేరి.. పోటీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తోంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు కూడా చేసింది. ఇంతే కాదు…మరికొందరు సైతం పార్టీ మారుతారన్న సంకేతాలు రావడంతో నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసినంత సమయం పట్టడం లేదు పార్టీలో నేతల్ని కాపాడుకోవడం. మార్చి 3వరకే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ఈలోపే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో నలుగురు టిడిపి అభ్యర్థులు పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. విశాఖలోను టిడిపి అభ్యర్థి వైసీపీలోకి జంప్ అయ్యారు. బీ ఫామ్స్ ఇచ్చిన నేతలు గంప గుత్తగా వైసీపీలో చేరడంతో టీడీపీ డైలమాలో పడింది.

ప్రతిపక్ష అభ్యర్ధులు పార్టీ మారడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేయడం, అభ్యర్ధుల్ని నయానో..భయానో తమ వైపు తిప్పుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఇదే విషయంలో SECకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో టీడీపీతరుపున పోటీచేస్తున్నామనిచెప్పిన వాళ్లు …. వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ తరుపున పోటీచేస్తారా అని ప్రశ్నించారు. అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. జంప్‌ జిలానీలను అనర్హులుగా ప్రకటించి.. పోటీనుంచి తప్పించాలన్నారు.

ప్రతిపక్ష పార్టీ వెర్షన్ ఇలా ఉంటే….గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి నామినేషన్ వేసి బీఫామ్‌ని ఆర్వోకి ఇచ్చిన తర్వాత తాము ఏమి చేయలేమని ఎన్నికల కమిషన్ అంటోంది. ఆ అభ్యర్థులకు ఆ పార్టీ గుర్తు కేటాయించి.. అభ్యర్థులు జాబితాలో ప్రకటిస్తామని తెలిపింది. ఒక వేళ పార్టీ బి పామ్ ఇవ్వకుండా పోటీలో ఉంటే స్వతంత్రులుగా గుర్తించి.. గుర్తులు కేటాయిస్తామంది. జంప్‌ జిలానీల విషయంలో ఎస్‌ఈసీ చేతులెత్యేడంతో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జరిగిన నష్టాన్ని పక్కనపెట్టి ఇంకా పార్టీ నుంచి ఎవరూ జరిపోకుండా జాగ్రత్త పడుతోంది.
Read also : యూపీ, హర్యానా ప్రాచీన మల్లయుద్ధ యోధులతో పవన్‌ కుస్తీ, ప్రతీ ఒక్కరూ బరిలో దిగండన్న జనసేనాని