పశ్చిమగోదావరిలో రెచ్చిపోయిన దుండగుడు.. ఏఎస్ఐ టార్గెట్‌గా అటాక్.. కత్తితో గాయపరిచి పరార్..

పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరంలో దుండగుడు రెచ్చిపోయాడు. ఏఎస్ఐ పార్థసారథి లక్ష్యంగా అటాక్ చేశాడు. కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు. ఈ ఘటనలో పార్థసారథికి తీవ్ర గాయాలయ్యాయి. పార్థసారథిని చికిత్స నిమిత్తం వెంటనే భీమవరంలోని..

పశ్చిమగోదావరిలో రెచ్చిపోయిన దుండగుడు.. ఏఎస్ఐ టార్గెట్‌గా అటాక్.. కత్తితో గాయపరిచి పరార్..

Updated on: Dec 13, 2020 | 8:38 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరంలో దుండగుడు రెచ్చిపోయాడు. ఏఎస్ఐ పార్థసారథి లక్ష్యంగా అటాక్ చేశాడు. కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు. ఈ ఘటనలో పార్థసారథికి తీవ్ర గాయాలయ్యాయి. పార్థసారథిని చికిత్స నిమిత్తం వెంటనే భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మత్స్యపురి రోడ్డులో పోలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందంటూ సమాచారం అందడంతో ఏఎస్ఐ పార్థసారథి, హెడ్ కానిస్టేబుల్ మూర్తి అక్కడికి వెళ్లారు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఓ వ్యక్తి పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎఎస్ఐ పార్థసారథి తీవ్రంగా గాయపడగా, హెడ్ కానిస్టేబుల్ మూర్తి తప్పించుకున్నాడు. గాయపడిని పార్థసారథిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

 

Also Read:

TELANGANA CONGRESS: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. ముందు వరుసలో నేనే ఉంటానంటూ..

‘కుక్కకు బొక్క దొరికినట్లు’ కొన్ని పార్టీలు ఎగిరెగిరి పడుతున్నాయంటూ మంత్రి ఎర్రెబల్లి దయాకర్ ఎద్దేవా

Loading...
Unable to load recommendations.
Follow Us