శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు ఆటలు(Sports) ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆటలు ఆడేందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆసక్తి కనబరుస్తారు. కానీ అవే క్రీడలు కబళించే మృత్యువుగా మారితే.. ఊహించుకోవడమే భయంగా ఉంది. కానీ ఇలాంటి ఘటనలు నిజంగా జరుగుతున్నాయి. ఆరోగ్యాన్ని అందించాల్సిన ఆటలు.. కబళించే మృత్యుకూపాలుగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జగ్గయ్యపేటలోని(Jaggayyapet) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చందు కు క్రికెట్( ఆడటం చాలా ఇష్టం. ఎప్పటిలాగానే నిన్న (శుక్రవారం) సాయంత్రం క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఫీల్డింగ్ లో ఉన్న సమయంలో బాల్ ను అందుకునేందుకు గాల్లో లేచాడు. అంతే ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు గమనించి పైకి లేపేందుకు ప్రయత్నించారు. చికిత్స కోసం జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే చందు మృతి చెందాడు. మన్యం జిల్లాకు చెందిన తిరుపతిరావుకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండో వాడైన చందు జగ్గయ్యపేటలో చదువుకుంటున్నాడు. మంచిగా చదువుకుని, జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడతాడనుకున్న కుమారుడు ఇలా ఊహించని విధంగా చనిపోవడంపై ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరో ఘటనలో.. తిరుపతి పడమట పోలీస్ స్టేషన్ ప్రాంతాలనికి చెందిన ఎస్సై సుబ్రమణ్యం వయసు యాభై ఏడేళ్లు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. కూతకు వెళ్లి వస్తూ ఉన్నట్టుండి కుప్పకూలారు. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read
Hyderabad: తలపై జుట్టు మొలిపిస్తామంటూ శఠగోపం పెట్టారు.. చీటింగ్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్
Hanuman Jayanti: నేడే వీరహనుమాన్ శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమలు.. పూర్తి వివరాలివే