Tv9 ఎఫెక్ట్‌: విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల విషయంలో తనిఖీలు.. సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

|

Jun 09, 2021 | 8:03 PM

విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల విషయంలో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపుల్లో తనిఖీలు, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని డిప్యూటీ..

Tv9 ఎఫెక్ట్‌: విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల విషయంలో తనిఖీలు.. సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌
Follow us on

విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల విషయంలో ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపుల్లో తనిఖీలు, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. దీంతో స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మద్యం అమ్మకాల సొమ్ము డిపాజిట్‌, రికార్డులను ఎక్సైజ్‌ సిబ్బంది పరిశీలించనున్నారు.

తమ పరిధిలోని దుకాణాలను కాకుండా జంబ్లింగ్‌ విధానంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ సీఐలకు ఆదేశించింది. మొత్తం 2894 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. విశాఖ సహా మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి రావడంతో డిప్యూటీ ముఖ్యమంత్రి స్పెషల్‌ డ్రైవ్‌కు ఆదేశించారు. అయితే ఇప్పటికే విశాఖలో 14 మద్యం దుకాణాల్లో రూ. 34 లక్షల మేర అవకతవకలు జరిగాయని గుర్తించారు అధికారులు. ఈ అవకతవకల్లో భాగంగా ఓ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసింది ఏపీ సర్కార్‌. ఈ విషయంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఇవీ కూడా చదవండి:

కేంద్రం హెచ్చరిక: అలాంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. లేదంటే మోసపోవాల్సిందే..!

నయా దోపిడీ.. నేరగాళ్ల చేతిలో మోసపోయిన 5 లక్షల మంది.. రూ.150 కోట్ల మోసం.. గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు