TTD: టీటీడీ మరో సంచలన నిర్ణయం.. ఏకంగా పేరు మార్చేసిన పాలక మండలి..!

| Edited By: Balaraju Goud

Nov 19, 2024 | 5:22 PM

టెంపుల్ సిటీ తిరుపతికో మణిహారంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు మార్పు వ్యవహారం చర్చగా మారింది.

TTD: టీటీడీ మరో సంచలన నిర్ణయం.. ఏకంగా పేరు మార్చేసిన పాలక మండలి..!
Garuda Varadhi
Follow us on

టెంపుల్ సిటీ తిరుపతి కి సరికొత్త అందాన్ని తీసుకొచ్చిన వంతెన పేరు మరోసారి మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్మించిన ఫ్లై ఓవర్ పేరును టీటీడీ మార్చింది. 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో గరుడ వారిధిగా ప్రారంభమైన వంతెన నిర్మాణం పూర్తయ్యాక 2023లో శ్రీనివాస సేతుగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లై ఓవర్ తిరుపతి అభివృద్ధిలో మైలు రాయిగా మారిన ఫ్లై ఓవర్ తిరిగి పాత పేరుతో ఇప్పుడు దర్శనమిస్తోంది.

తిరుపతికో మణిహారం గా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు మార్పు వ్యవహారం చర్చగా మారింది. గరుడ వారిధిగా ప్రారంభమైన వంతెన నిర్మాణం పూర్తయి ప్రారంభాని కంతా శ్రీనివాస సేతుగా మారింది. 2019 మార్చి నెలలో అప్పటి టిడిపి ప్రభుత్వంలో గరుడ వారిధి గా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 684 కోట్లతో 7 కిలో మీటర్ల కు పైగా పొడవుతో నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ 2023 సెప్టెంబర్ లో అందుబాటులోకి వచ్చింది. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్, టీటీడీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. తిరుమల యాత్రికులకు, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలకు తెరపడినట్లు అయింది.

టెంపుల్ సిటీ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు, తిరుమలకు వెళ్లే భక్తులకు అత్యంత అనువుగా ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు దశల్లో వంతెన నిర్మాణం పూర్తి కాగా వారధి పొడవు 7.34 కిలో మీటర్లు ఉండగా 173 పిల్లర్లపై నిర్మాణం జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ. 684 కోట్లు కాగా 67:33 నిష్పత్తిలో టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల కేటాయింపు చేశారు. 2019 మార్చిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన జరగ్గా, ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ తన వాటాగా రూ.458 కోట్లు ఖర్చు చేసింది.
ఆఫ్కాన్స్ సంస్థ ఏకమ్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసింది.

దాదాపు 5 ఏళ్ల పాటు జరిగిన వంతెన పనులు వివిధ దశల్లో పూర్తి చేయగా 2023 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకుంది. తిరుపతి అభివృద్ధిలో కీలకంగా మారిన గరుడ వారిధి పేరు అప్పట్లో శ్రీనివాస సేతుగా మారి పోయింది. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ లో ఈ మేరకు పేరు మార్చి పౌరాణిక నేపథ్యాన్ని వివరించారు. ఇలా పేరు మారిన శ్రీనివాస సేతు వంతెనకు కూటమి సర్కార్ గరుడ వారధి గానే పరిగణించాలని భావించింది.

ఇందులో భాగంగానే టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడింది. శ్రీనివాస సేతు పేరును మార్చి వంతెనకు గరుడ వారధి పేరునే కొనసాగించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. దీంతో తిరుపతి అభివృద్ధిలో కీలకంగా కనిపించే వంతెన ఇకపై గరుడ వారధినే పరిగణించాల్సింది. ఈ మేరకు వంతెన పై గరుడవారధి పేరు కూడా అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..