ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశభక్తి ప్రదర్శన! వీడియో ఇదిగో

Kankipadu Drone National Flag: కృష్ణా జిల్లా కంకిపాడులో పచ్చని పంట పొలాలపై జాతీయ జెండాను మోస్తూ డ్రోన్ ఎగిరింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు దేశభక్తిని జోడించిన ఈ వినూత్న దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన చేశారు.

ఆహా..! పచ్చని పొలాల్లో మువ్వన్నెల జెండా.. డ్రోన్‌తో వినూత్న దేశభక్తి ప్రదర్శన! వీడియో ఇదిగో
Kankipadu Drone National Flag

Edited By:

Updated on: Aug 15, 2026 | 1:48 PM

పచ్చని పంట పొలాలు.. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్.. దానికి రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా.. చూపరులను కట్టిపడేసిన ఈ దృశ్యం కృష్ణా జిల్లా కంకిపాడులో కనిపించింది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్రోన్ రాజా ఆధ్వర్యంలో.. ఈసారి దేశభక్తిని చాటేలా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా పొలాల్లో పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయడానికి ఉపయోగించే డ్రోన్‌కు.. జాతీయ జెండాను అమర్చారు. అనంతరం పచ్చని పంట పొలాలపై డ్రోన్‌ను ఎగురవేశారు. గాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా.. కింద పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలు కనిపించాయి. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడించడంతో పాటు.. దేశభక్తిని కూడా చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కంకిపాడు పరిసరాల్లో పచ్చగా కళకళలాడుతున్న వరి పొలాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్‌ గాల్లోకి ఎగరగానే.. దానికి అమర్చిన జాతీయ జెండా గాలికి రెపరెపలాడింది. పచ్చని పొలాల మధ్య కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం ప్రత్యేకంగా కనిపించింది. ఆకాశంలో డ్రోన్‌తో పాటు జాతీయ జెండా ఎగురుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా ఆకాశంలో డ్రోన్ ఎగరడం చూస్తుంటాం.. కానీ జాతీయ జెండాను మోస్తూ డ్రోన్‌ ఎగరడం మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఒకవైపు ఆకాశంలో మువ్వన్నెల జెండా.. మరోవైపు నేలపై పచ్చని పంట.. మధ్యలో ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా డ్రోన్.. ఈ దృశ్యం ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చింది. దేశానికి సరిహద్దుల్లో సైనికుడు కాపలా కాస్తే.. దేశానికి ఆహారం అందించేందుకు రైతు పొలంలో శ్రమిస్తాడు. ఆ రైతు పొలంలోనే జాతీయ జెండా ఎగరడం.. దేశభక్తికి మరో అందమైన రూపంగా నిలిచింది.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us