కొబ్బరి బోండం కొనాలంటే వడదెబ్బ తగిలినట్లే.. ధరలు చూసి భయపడుతున్న ప్రజలు..

|

Apr 27, 2024 | 3:07 PM

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొబ్బరి బొండాల మాఫియా నడుస్తోంది. వేసవి కాలం అనగానే రోడ్లపై దాహార్తిని తీర్చేందుకు కొబ్బరి బోండాలు, చెరుకు రసం జ్యూస్, ఇతర రకాల శీతలపానీయలు కనిపిస్తాయి. అయితే నేచురల్ వాటర్ పైగా ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగేందుకు జనాలు మక్కువ చూపుతారు. వీరి అవకాశాన్ని అదునుగా భావించి కొబ్బరి బోండాల ధరలు అమాంతం పెంచేశారు వ్యాపారులు.

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొబ్బరి బొండాల మాఫియా నడుస్తోంది. వేసవి కాలం అనగానే రోడ్లపై దాహార్తిని తీర్చేందుకు కొబ్బరి బోండాలు, చెరుకు రసం జ్యూస్, ఇతర రకాల శీతలపానీయలు కనిపిస్తాయి. అయితే నేచురల్ వాటర్ పైగా ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగేందుకు జనాలు మక్కువ చూపుతారు. వీరి అవకాశాన్ని అదునుగా భావించి కొబ్బరి బోండాల ధరలు అమాంతం పెంచేశారు వ్యాపారులు. సిండికేట్‎గా మారి కృత్రిమ కొరతను సృష్టించారు. వేసవి తాపాన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. ధరలను నియంత్రించలేక వదిలేయడంతో ఇష్టానుసారంగా పెంచేశారు. మండే ఎండలకంటే కూడా కొబ్బరి బోండాల ధరలే మండిపోతున్నాయి. ఒక్క కొబ్బరి బొండం ధర కర్నూలులో రూ.60 పలుకుతోంది. ఇతర జిల్లాలలో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఇది చాలా ఎక్కువ అని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొబ్బరి బోండాల ధరలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on