Tomato Price Hike: ఓవైపు వేసవిలో మండిస్తున్న ఎండలతో తగ్గిన పంటల దిగుబడితో రోజు రోజుకీ కూరగాయలు ధరలు పెరిగిపోతుంటే.. మరోవైపు నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తూ చికెన్, మటన్ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ సహా నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదంటూ.. వాపోతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర బాగా పెరిగిపోయింది. పలు మార్కెట్లలో టమాటా ధర సెంచరీ కొట్టింది. టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో తమపై అదనపు భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
ఆంధప్రదేశ్, తెలంగాణలోని పలు మార్కెట్లలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అనేక కూరగాయల మార్కెట్లలో టమాటా సెంచరీ కొట్టింది.
ఏపీలో వేసవి సీజన్ లో టమాట దిగుబడి తగ్గిన నేపథ్యంలో టమాట ధర రోజురోజుకీ పెరుగుతోంది. కర్నూలు హోల్ మార్కెట్ లో టమాటా ధర తాజాగా సెంచరీకి చేరువలో ఉంది. ఇక చిత్తూరులోని మదనపల్లి,అనంతరం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో సహా అనేక బహిరంగ మార్కెట్లలో టమాటా ధర రూ. 70 నుంచి 100 వరకూ ఉంది. దీంతో టమాటా ధర పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటోంది.
మరోవైపు తెలంగాణాలో కూడా టమాటా ధర చుక్కలనంటుతుంది. మంచిర్యాల మార్కెట్ లో సోమవారం టమాటా కిలో రూ.100లకు చేరుకుంది. మార్చి నెలలలో కిలో టమాటా ధర రూ.30లు ఉండగా..ఏప్రిల్ 20 నుంచి టమాటా ధరలు క్రమంగా పెరుగుతూ.. ఇప్పుడు సెంచరీకి చేరుకుంది.
ఎండల తీవ్రతకు కూరగాయల ధరలు అంబరాన్ని తాకుతుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో జనం సతమతమవుతున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..