బంగారం ధర రెండు రోజులుగా స్వల్పంగా పెరగగా… డిసెంబర్ 29న పది గ్రాముల ధర రూ.480 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 28న రూ. 49,730 ఉండగా.. నేడు అది రూ.50,210కి పెరిగింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,580గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.47,100 ఉండగా… 24 క్యారెట్ల ధర 51,280గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 49,210,కాగా 24 క్యారెట్ల ధర 50,210. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,230గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర అంటే… 51,280గా ఉంది.