Watch Video: వామ్మో పడగ విప్పి బుసలు కొడుతున్న నాగరాజు.. ఎలా పట్టుకున్నాడో చూడండి!

Tirumala News: టెంపుల్‌ సిటీ తిరుమలలో ఈ మధ్య విష సర్పాలు హల్చల్‌ చేస్తున్నాయి. తరచూ జనావాసాలు, భక్తులు ఉండే ప్రదేశాల్లో సంచరిస్తూ వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆలయ పరిసరాల్లోని రెండు ప్రాంతాల్లో కనిపించిన పాములు జనాలను పరుగులు పెట్టించాయి.

Watch Video: వామ్మో పడగ విప్పి బుసలు కొడుతున్న నాగరాజు.. ఎలా పట్టుకున్నాడో చూడండి!
Tirumala Snake Video

Edited By:

Updated on: Sep 20, 2025 | 10:14 PM

తిరుమలలో ఈ మధ్య పాములు హల్చల్ చేస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న ఈ విష సర్పాలు తరచూ జనాల మధ్యకు వచ్చి స్థానికులు, భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలానే తాజాగా బాలాజీ నగర్ లోని ఒక ఇంట్లోకి చొరబడిన నాగుపాము స్థానికులను పరుగులు పెట్టించింది. ఇంటి నెంబర్..1022లో 8 అడుగులు ఉన్న నాగుపాము అలికిడిని గుర్తించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా ఆ 8 అడుగుల పామును పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా పాపనాశనము వద్ద మరో ఆరు అడుగుల నాగుపాము భక్తుల కంటపడింది. పామును చూసి భయపడిపోయిన స్థానికులు వెంటనే టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్నస్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. దీంతో క్షణాల్లో పాపవినాశనం వద్దకు చేరుకున్న బాస్కర్‌ ఆరు అడుగుల నాగుపామును బంధించాడు. ఇలా రెండు పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వాటిని సేఫ్ గా శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.