TTD: గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?

పశ్చిమాషియా యుద్ధం వలన ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తే ముప్పులో, టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో అన్నప్రసాదాలు, ఇతర అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సరఫరాకు ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్యాస్ సరఫరా ఆపోద్దంటూ ఐఓసీఎల్ కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దీనిపై ఐఓసీఎల్ సైతం సానుకూలంగా స్పందించింది.

TTD: గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
Ttd

Edited By:

Updated on: Mar 11, 2026 | 8:15 PM

పశ్చిమాషియా యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం పుట్టుమడుతున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తయింది. కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్న టీటీడీ అవసరాలకు ఇబ్బంది రాకుండా ముందస్తుచర్యలు తీసుకుంది. గ్యాస్ కొరత రాకుండా టీటీడీ అప్రమత్తమైంది.గ్యాస్ సరఫరా ఆపోద్దంటూ ఐఓసీఎల్ కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది

ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అవసరాలకు గ్యాస్ కొరత రాకపోయినా ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తిరుమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్నప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఐఓసీఎల్ కు రాసిన లేఖలో టీటీడీ పేర్కొంది. ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి టీడీకి సరఫరాను కొనసాగించాలని లేఖలో పేర్కొంది. అయితే టీటీడీ లేకపై అటు ఐఓసీఎల్ సైతం సానుకూలంగా స్పందించింది.

అయితే టీటీడీకి రోజూ దాదాపు 5 టన్నుల మేర గ్యాస్ అవసరం ఉంది. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీ ఇతర అవసరాలతో పాటు.. తిరుపతి తిరుచానూరు టిటిడి అనుబంధ ఆలయాల్లో కమర్షియల్ గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో టిటిడి గ్యాస్ కొరతను అధిగమించే ప్రయత్నాన్ని ముందుగానే చేస్తుంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే టీటీడీ అలర్ట్ అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us