Nagari MLA Roja Cries: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా..

|

Jan 18, 2021 | 3:17 PM

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజక వర్గంలో ఏ కార్యక్రమం జరిగినా పిలవడం లేదని...

Nagari MLA Roja Cries:  ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా..
Follow us on

Nagari MLA Roja Cries: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజక వర్గంలో ఏ కార్యక్రమం జరిగినా పిలవడం లేదని.. ప్రోటోకాల్ పాటించడం లేదని చైర్మన్ గోవర్ధన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా తనకి ఆహ్వానం అందలేదని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా నే తనను పిలవడం లేదని కమిటీ చైర్మన్ కు రోజా పిర్యాదు చేశారు. తిరుపతిలో జరిగిన కమిటీ మీటింగ్ లో తన సమస్యలను రోజా వివరించే ప్రయత్నం చేశారు. రోజా ఫిర్యాదు పై స్పందించిన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ నిచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Also Read: పెద్దన్న జో ప్రమాణస్వీకారోత్సవానికి భారీ భద్రత.. అమెరికా చరిత్రలోనే ఇలా తొలిసారి