AP Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 కి చేరిన మృతుల సంఖ్య..

| Edited By: Ravi Kiran

Mar 28, 2022 | 7:03 AM

Chittoor district road accident: చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై యావత్‌ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9 కి చేరింది. మదనపల్లె - తిరుపతి

AP Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 కి చేరిన మృతుల సంఖ్య..
Road Accident
Follow us on

Chittoor district road accident: చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్‌లో ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై యావత్‌ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9 కి చేరింది. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని మలుపు వద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం నాగలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య 9 కి చేరినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు అనే యువకుడికి చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ వద్ద ఉన్న పెద్ద మలుపులో ప్రమాదం జరిగింది.

కాగా.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ, సీఎం జగన్‌తో సహా ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదాన్ని ఓ దురదృష్ట ఘటనగా అభివర్ణించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అటుకేంద్రం, ఇటు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి 50వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. గాయపడినవారు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించి.. వారికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

రహదారి ప్రమాదాలపై అప్రమత్తమైన ప్రభుత్వం.. బస్‌ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. బస్‌లోయలో పడిన ప్రాంతాన్ని పరిశీలించారు చిత్తూరు కలెక్టర్‌. మెటల్ క్రాస్ బ్యారియర్స్, అదనంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే.. ఘాట్‌లో ప్రమాదాలను అరికట్టొచ్చని కలెక్టర్‌కు తెలిపారు అధికారులు. రెండు వైపులా రోడ్డు విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని అధికారులు కలెక్టర్‌కు అందించిన నివేదికలో సూచించారు. ఘాట్‌ రోడ్‌లో ప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తోయో చూడాలి.

Also Read:

Tirupati: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి

Tirupati: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..