AP CM YS Jagan letter : తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు పంపారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. రాష్ట్రాభివృద్ధి, వాగ్దానాల అమలు, ప్రభుత్వ దార్శనికతను సీఎం ఆ లేఖలో ప్రస్తావించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా లేఖలు రాశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ సంతకం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. 22 నెలల పరిపాలన కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు జగన్. వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఆ లేఖల్లో ప్రస్తావించారు ముఖ్యమంత్రి జగన్.
ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ.. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. అధికార వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ కేంద్రమంత్రి వనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన కూటమి నుంచి రత్న ప్రభ అనే మాజీ ఐఏఎస్ అధికారిని, కాంగ్రెస్ పార్టీ చింతామోహన్ గెలుపుకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
Read also : Fire broke out in four coaches of a train : హర్యానాలో దుర్ఘటన… కాలి బూడిదైన నాలుగు రైల్ కోచ్‌లు