Tirumala Tirupati Temple: పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో పాడు పనికి తెరలేపారు. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదని భావించి.. గుట్టు చప్పుడు కాకుండా అడ్డా ఏర్పాటు చేశారు. కానీ, ఆఖరికి గుట్టు రట్టయ్యి.. అడ్డంగా బుక్కయ్యారు. ఏడుగురు అరెస్ట్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. తిరుపతిలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లాడ్డీని అడ్డాగా చేసుకుని వ్యభిచారం నడుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి.. వారి బెండు తీశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్డీపై దాడి చేసి.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న ఆర్య నివాస్ లాడ్జీలో ఈ వ్యభిచారం నిర్వహించడం ఆశ్చర్యకరం. మంగళం క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఒక మహిళ.. పూణె, కలకత్తాకు చెందిన యువతులను తిరుపతికి తీసుకువచ్చి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ముగ్గురు మహిళలు సహా, నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..