Tirumala: మళ్లీ ఫాంలోకి వచ్చిన స్నేక్ క్యాచర్.. 8 అడుగుల భారీ పైథాన్‌ను ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో

|

May 28, 2022 | 8:26 AM

స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేక, పాములను పట్టేందుకు రాలేదు.

Tirumala: మళ్లీ ఫాంలోకి వచ్చిన స్నేక్ క్యాచర్.. 8 అడుగుల భారీ పైథాన్‌ను ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో
Snake Catcher Bhaskar Naidu
Follow us on

Tirumala snake catcher bhaskar naidu: తిరుమలలో పాములు పట్టే టీటీడీ ఉద్యోగి భాస్కర్‌నాయుడు, మళ్లీ ఫాంలోకి వచ్చారు. పూర్తిగా కోలుకోవడంతో విధుల్లో చేరారు. తాజాగా, తిరుమలలోని బాలాజీనగర్‌లో కొండ చిలువ హల్‌చల్ చేసింది. 8 అడుగుల కొండ చిలువ ఇళ్ల వద్దకు రావడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. దీంతో పామును చాకచక్యంగా పట్టుకొని, సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు, స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేక, పాములను పట్టేందుకు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతిలో ఓ విషపూరిత పామును పట్టే క్రమంలో, ఆయన పాముకాటుకు గురయ్యారు. మొదట తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి అక్కడి నుంచి, మెరుగైన వైద్యం కోసం రేణిగుంటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న టైంలో ఆయనకు డెంగీ కూడా సోకింది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మందగించింది. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

అప్పుడు ఆయన పరిస్థితి కొంత విషమంగానే ఉందని వార్తలు వచ్చాయి. దీంతో భాస్కర్‌ నాయుడు త్వరగా కోలుకోవాలని తిరుమల వాసులు పూజలు చేశారు. ప్రజల పూజలు ఫలించి, భాస్కర్‌నాయుడు పూర్తిగా కోలుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ, తిరుమలలో పామును పట్టి సురక్షిత ప్రాంతంలో వదిలారు. భాస్కర్‌నాయుడు రీఎంట్రీ ఇవ్వడంతో, తిరుమల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. భాస్కర్‌నాయుడు ఇప్పటివరకు దాదాపు 10వేల పాములను పట్టుకొని, అడవిలో వదిలేశారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. మనుషుల ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు, బుసలు కొట్టే నాగుపాములను ఒంటి చెత్తో పట్టుకుంటాడనే పేరుంది.

వీడియో చూడండి.. 

ఇవి కూడా చదవండి