Tirumala News Today: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఫిబ్రవరి కోటాను బుధవారం ఉదయం టీటీడీ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది. ఒక యూజర్ ఐడీ నుంచి ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకోవాలని తెలిపింది.
భక్తుల సౌకర్యార్ధం రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 17 స్లాట్లలో ఇవ్వనుంది. దీనిని భక్తులు గమనించి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. అటు ఈ నెల 19న రథసప్తమి సందర్భంగా దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు కొనసాగిస్తున్నామని.. ప్రస్తుతం పరిమితి సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తున్నామని టీటీడీ తెలిపింది.