Tirumala: అజ్ఞాత భక్తుడి మహాదానం.. శ్రీవారికి 9 సెట్ల బంగారు ఆభరణాలు.. 121 కిలోల్లో ఏమేం ఉన్నాయంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త 121 కిలోల బంగారు ఆభరణాలను భారీ విరాళంగా సమర్పించనున్నారు. సుమారు రూ.140 నుంచి రూ.150 కోట్ల విలువైన ఈ కానుకలో తొమ్మిది సెట్ల ఆభరణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ అధికారులు వీటిని స్వీకరించనున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలు, ఉత్సవాల్లో ఈ ఆభరణాలను ఉపయోగించనున్నారు.

Tirumala: అజ్ఞాత భక్తుడి మహాదానం.. శ్రీవారికి 9 సెట్ల బంగారు ఆభరణాలు.. 121 కిలోల్లో ఏమేం ఉన్నాయంటే?
Tirumala Gold Donation

Edited By:

Updated on: Nov 26, 2026 | 8:25 AM

తిరుమల శ్రీవారికి భక్తుల కానుకల పరంపరలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక అందనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి 121 కిలోల బంగారు ఆభరణాల భారీ విరాళం చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త ద్వారా అందనుంది. 9 సెట్లుగా ఉన్న 45 ఆభరణాలను శ్రీ వెంకటేశ్వరస్వామి కి సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలోనే శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకల్లో ఇదే అతిపెద్ద విరాళంగా టీటీడీ చెబుతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ బంగారు ఆభరణాలను టీటీడీకి అందజేయనున్నారు. తిరుమల చేరుకోనున్న సీఎం చంద్రబాబు దాతలు బంగారు ఆభరణాలను టీటీడీకి అధికారికంగా అందించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామివారికి నిత్యం జరిగే వివిధ కైకర్యాలు, ఉత్సవాల్లో ఉపయోగించేందుకు వీలుగా ఈ ఆభరణాలను దాతలు విరాళంగా అందజేయనున్నారు. ఇక.. మేలిమి బంగారంతో ఈ ఆభరణాలను చేయించారు భక్తులు. శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలను సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ అధికారికంగా స్వీకరించనుంది.

140 నుంచి 150 కోట్ల రూపాయల పైమాటే!

చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త.. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి భారీ కానుకగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే శ్రీవారికి నిత్యం అలంకరించే ఆభరణాల బరువు సుమారు 650 కిలోలు ఉండగా.. ఇప్పుడు ఈ 121 కిలోల నగలు కూడా వాటిలో చేరబోతున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ సుమారు 140 నుంచి 150 కోట్ల రూపాయల పైమాటే! శ్రీవారి దయవల్లే తన వ్యాపారం ఇంతలా అభివృద్ధి చెందిందని నమ్మిన ఆ పారిశ్రామికవేత్త.. తన కంపెనీ లాభాల్లో వాటాను బంగారం రూపంలో ఇవ్వాలని మొక్కుకున్నారు. అయితే, కుడిచేత్తో ఇచ్చే దానం ఎడమచేతికి తెలియకూడదన్నట్లు… తన పేరును ఎక్కడా బయటపెట్టవద్దని సీఎం చంద్రబాబుకు విన్నవించి ఆయన అజ్ఞాతంగానే ఉండిపోయారు.

మొత్తం 46 రకాల ఆభరణాలతో..

ఆగమ శాస్త్రం ప్రకారం సుమారు 15 నెలల పాటు ఎంతో నైపుణ్యంతో ఈ ఆభరణాలను తయారు చేయించారు. ఇందులో శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలు, భుజకీర్తులు, శంఖుచక్రాలు, వడ్డాణం, అభయ హస్తాలు సహా మొత్తం 46 రకాల ఆభరణాలతో కూడిన 9 సెట్లు ఉన్నాయి. వీటిని నిత్యం జరిగే కైంకర్యాలు, ఉత్సవాలలో స్వామివారికి అలంకరించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us