Godavari river: సినిమాకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు.. గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు యువకుల గల్లంతు..

Three youths drowned in Godavari river: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సినిమాకు వెళ్లి వస్తూ సరదాగా

Godavari river: సినిమాకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు.. గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు యువకుల గల్లంతు..
drowning

Updated on: Apr 12, 2021 | 11:20 AM

Three youths drowned in Godavari river: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సినిమాకు వెళ్లి వస్తూ సరదాగా గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని కొవ్వూరు సమీపంలో చోటుచేసుకుంది. గల్లంతైన ముగ్గురు యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చాగల్లుకు చెందిన ఆరుగురు యువకులు ఆదివారం ఓ సినిమా చూసేందుకు కొవ్వూరుకు వెళ్లారు. తిరిగి వస్తూ సాయంత్రం వేళ ముగ్గురు యువకులు ముగ్గురు తినుబండారాల కోసం వెళ్లారు. మిగతా గోదావరిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి ముగ్గురు యువకులు కూడా కొట్టుకుపోయారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు సంఘటనా స్థలానికి రాగా.. వారు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురి కోసం గజ ఈతగాళ్లతో గాలించగా.. ఒకరి మృతదేహం కనిపించింది. సత్యనారాయణ మృతదేహం గోష్పాద క్షేత్రం వద్ద లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు యువకులను హేమంత్‌, సోమరాజుగా గుర్తించారు. అనంతరం మిగతా యువకుల నుంచి సమచారం సేకరించారు. గల్లంతైన యువకుల గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..

తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోన్న కరోనా, రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి