Andhra: రక్తమోడిన తెలుగు రాష్ట్రాలు.. 24 గంటల గడవకముందే వరుసగా 3 ప్రైవేట్ బస్సు ప్రమాదాలు

ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లింగపాలెం మండలం జూబిలినగర్ దగ్గర ప్రమాదానికి గురైంది.

Andhra: రక్తమోడిన తెలుగు రాష్ట్రాలు.. 24 గంటల గడవకముందే వరుసగా 3 ప్రైవేట్ బస్సు ప్రమాదాలు
Andhra Pradesh

Updated on: Nov 04, 2025 | 8:50 AM

ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లింగపాలెం మండలం జూబిలినగర్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి ముందు ధర్మాజీగూడెంలో బైక్‌ను ఢీకొట్టింది బస్సు. బైక్‌పై వెళ్తున్న వారు వెంటపడుతారన్న ఆందోళనలో బస్సును వేగంగా నడిపాడు డ్రైవర్. దీంతో బస్సు టర్నింగ్ దగ్గర బోల్తా పడింది.

శ్రీసత్యసాయి జిల్లాలో ఐషర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద జరిగిందీ ప్రమాదం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం దగ్గర ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులతో కావలి నుంచి హైదరాబాదు వెళ్తోంది బస్సు.

అటు చేవెళ్లలో నిన్న ఘోర బస్సు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అలాగే చేవెళ్ల ప్రమాదంలో చనిపోయిన 19మంది పోస్ట్‌మార్టం పూర్తి కావడంతో.. డెడ్‌బాడీలను బంధువులకు అప్పగించారు అధికారులు. దాదాపు అందరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇంకా.. 32 మంది , ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. పట్నం మహేందర్‌ రెడ్డి మెడికల్‌ కాలేజీలో 15మందికి చికిత్స అందించగా.. ఆరుగురు డిశ్చార్జీ అయినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్‌ చేశారు. వికారాబాద్‌ ఆస్పత్రిలో 11మందికి ట్రీట్‌మెంట్‌ నడుస్తోంది. నిమ్స్‌ ఆస్పత్రిలో ఒకరు, చేవెళ్ల ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స జరుగుతోంది.