
మార్చి వచ్చిందంటే చాలు.. పరీక్షా సమయం వచ్చేసిందంతే.. ప్రతీ విద్యార్ధిలోనూ టెన్షన్ ఉంటుంది. చదువు, వీక్లీ టెస్ట్‌లు, ఫైనల్ పరీక్షలంటూ స్టూడెంట్స్ ఎక్కడలేని ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి తరుణంలో వాళ్లకు కాస్త రిలీఫ్ కావాలంటే.. స్కూల్‌కి ఓ హాలిడే ఉండాల్సిందే. వారంతా కూడా ప్రతీ నెలా హాలీడేలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి.. సండే ఎప్పుడొస్తుందోనని ఎదురు చూస్తుంటారు. స్కూల్స్‌కు ఉన్న హాలిడేలను దాదాపుగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మార్చి నెలలో పలు రోజులు స్కూల్స్‌కు సెలవులు ఉండబోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి.
ఈ నెల ఐదు ఆదివారాలు ఉండనుండగా, రెండో శనివారం కూడా స్కూల్స్‌కి సెలవు ఉంటుంది. అటు మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25వ తేదీన హోలీ, మార్చి 29వ తేదీ గుడ్ ఫ్రైడే స్కూల్స్‌కు సెలవులు ఉంటాయి. మరోవైపు మార్చి 8 నుంచి వరుసగా 3 రోజుల పాటు పాఠశాలలు బంద్ కానున్నాయి. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8న శుక్రవారం రాగా.. ఆ రోజున విద్యార్ధులకు సెలవు, అలాగే మరుసటి రోజు మార్చి 9 రెండో శనివారం, ఆ తర్వాతి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు మూసి ఉంటాయి. అలాగే ఏప్రిల్‌లోనూ స్కూల్స్‌కు పలు సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 11న రంజన్, ఏప్రిల్ 17న శ్రీరామనవమి లాంటి పెద్ద పండుగలు ఉండటంతో ఆయా రోజుల్లో విద్యాసంస్థలను మూసి ఉంచుతారు.