Andhra Pradesh: ఉప్పాడ సముద్ర తీరంలో అద్భుత దృశ్యం.. ఎరుపు, నీలి రంగులో సందడి చేస్తోన్న సముద్రం..

|

Jul 19, 2022 | 6:20 AM

Andhra Pradesh: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో సముద్రంలో...

Andhra Pradesh: ఉప్పాడ సముద్ర తీరంలో అద్భుత దృశ్యం.. ఎరుపు, నీలి రంగులో సందడి చేస్తోన్న సముద్రం..
Follow us on

Andhra Pradesh: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో సముద్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కాకినాడలోని ఉప్పాడ సముద్ర తీరంలో కనిపించిన దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తూర్పు తీర ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో బురద నీరుతో నీలి సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారింది.

బురద నీరుతో కెరటాలు ఉప్పొంగుతున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎర్రగా మారి ఎగిసిపడుతున్నాయి. అయితే సముద్రం లోపల మాత్రం సముద్రం నీలి రంగులోనే ఉంది. దీంతో ఎరుపు, నీలి రంగుతో సముద్రంలో అద్భుత దృశ్యం కనిపిస్తోంది. వరద నీరు సాగర జలాలతో పూర్తిగా కలవడానికి కొంత సమయం పడుతుందని స్థానికంగా ఉన్న మత్స్యకారులు చెబుతున్నారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సముద్ర తీరంలో వేర్వేరు రంగుల్లో ఉన్న గోదావరి, సముద్రం జలాలు కనువిందు చేస్తున్నాయి. వీటిని కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..