పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.పండంటి కాపురాన్ని ఛిన్నాభిన్నం చేసింది. దాంపత్య బంధం కన్నా అనైతిక సంబంధానికే ప్రాధాన్యమిచ్చిన ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసింది. అందుకోసం 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మరీ కిరాయి హంతకులను నియమించింది. ఈ ఘటనలో దారుణం ఏంటంటే తన భర్త చనిపోయాడో లేదోనని నిర్ధారించుకునేందుకు హత్య చేసిన తరువాత భర్త గొంతుపై కాలు వేసి తొక్కినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మహిళతోపాటు ఆమె ప్రియుడు, మరో నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది.
భర్త హత్యకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చిన భార్య
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన చల్లా నరేంద్ర పదేళ్ల క్రితం లక్ష్మీప్రియను వివాహం చేసుకున్నాడు. పొదిలిలో కాపురం పెట్టాడు. కేంద్ర ప్రావిడెండ్ ఫండ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న చల్లా నరేంద్రకు, లక్ష్మీప్రియకు ఇద్దరు సంతానం ఉన్నారు. పదేళ్ళుగా సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో 8 నెలల క్రితం ఎదురింట్లో అద్దెకు దిగిన శశికుమార్ అనే యువకుడు చిచ్చు రేపాడు. లక్ష్మీప్రియ ఎదురింట్లో ఉంటున్న శశికుమార్‌కు మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబందాన్ని గుర్తించిన నరేంద్ర పలుమార్లు భార్య లక్ష్మీప్రియ, శశికుమార్‌లను హెచ్చరించాడు. తీరు మార్చుకోకుంటే ఇద్దరినీ చంపేస్తానని ఆవేశంలో బెదిరించాడు.
అయితే ఈ వార్నింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న లక్ష్మీప్రియ తమ ఇద్దరిని భర్త చంపేస్తాడని భావించింది. అందుకు గానూ ప్రియుడు శశికుమార్‌తో భర్తనే లేపేద్దామని ప్లాన్ వేసింది. అయితే ఈ ఇద్దరికి ధైర్యం సరిపోలేదు. తన నగలను ప్రియుడు శశికుమార్‌కు ఇచ్చి, వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి భర్త హత్యకు ప్లాన్ వేయాలని కోరింది. దీంతో నగలను అమ్మి వచ్చిన డబ్బుల్లో 2 లక్షల రూపాయలు నెల్లూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులను నియమించుకున్నారు. అనుకున్న విధంగా ఆగస్ట్ 2వ తేది అర్దరాత్రి దాటిన తరువాత చల్లా నరేంద్రను అతని భార్య లక్ష్మీప్రియ, ఆమె ప్రియుడు శశికుమార్, నలుగురు కిరాయి హంతకులతో కలసి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం వంటగదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. అయితే నరేంద్ర మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆగస్ట్ 2వ తేదిన జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చల్లా నరేంద్ర హత్య కేసును వారం రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడన్న కోపంతో భార్య లక్ష్మీప్రియ తన ప్రియుడు శశికుమార్‌తో కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. భర్త హత్య కోసం నెల్లూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులకు భార్య లక్ష్మీప్రియ 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్టు గుర్తించారు. చల్లా నరేంద్ర కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తన ఇంటి ఎదురుగా ఉన్న శశికుమార్ అనే యువకుడితో తన భార్య లక్ష్మీప్రియ వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న నరేంద్ర, ఇద్దరినీ మందలించారు.. దీంతో నరేంద్రను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసిన లక్ష్మిప్రియ, శశికుమార్‌లు నెల్లూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులకు 2 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి పొదిలికి పిలిపించుకున్నారు.
అందరూ కలిసి ఆగస్ట్ 2వ తేదీన అర్థరాత్రి ఇంట్లో నిద్రపోతున్న నరేంద్రను గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారు. ఈ దారుణంలో మరో దారుణం ఏంటంటే తన భర్త నరేంద్ర చనిపోయాడా.. లేదా.. అన్నదీ నిర్ధారించుకునేందుకు అప్పటికే చనిపోయిన నరేంద్ర గొంతుపై కాలు వేసి తొక్కి భార్య లక్ష్మీప్రియ పైశాచికంగా ప్రవర్తించడం.. అనంతరం నరేంద్ర మృతదేహానికి వంటింట్లో ఉరి వేసి అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే నరేంద్ర మరణంపై అనుమానం వ్యక్తం చేసిన అతని తండ్రి చల్లా వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నరేంద్ర మృతి పట్ల అతడి తండ్రి చల్లా వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నరేంద్రదీ హత్యగా తేల్చారు. తమ వివాహేతర సంబంధానికి నరేంద్ర అడ్డువస్తున్నాడన్న కారణంగా భార్య లక్ష్మీప్రియ ఆమె ప్రియుడు శశికుమార్‌లు మరో నలుగురు కిరాయి హంతకులతో నరేంద్రను హత్య చేసినట్టు గుర్తించి మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్‌పి ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ హత్యలో నెల్లూరుకు చెందిన 20 ఏళ్ళ వయస్సు ఉన్న నలుగురు యువకులు నహీద్, ఫజ్‌లు, సిద్దిఖ్, ముబారక్‌లకు 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్యకు వినియోగించినట్టు ప్రకాశం జిల్లా ఎస్‌పీ తెలిపారు.
మరిన్ని క్రైమ్