Python Snake: మండల ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ.. చివరకు ఏం జరిగిందంటే..?
సినిమాల్లో చూసిన ఫైట్ కంటే ఇంట్రస్టింగ్ ఫైట్. పట్టుకోవడానికి ట్రై చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కొండచిలువ. ఒళ్లు జలదరించే సీన్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
Catching Python Snake: సినిమాల్లో చూసిన ఫైట్ కంటే ఇంట్రస్టింగ్ ఫైట్. పట్టుకోవడానికి ట్రై చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కొండచిలువ. ఒళ్లు జలదరించే సీన్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోవెలకుంట్ల తాహసిల్దార్ కార్యాలయంలో భారీ కొండచిలువను అధికారులు గుర్తించారు. అప్పటికే అది అక్కడ గుడ్లు పెడుతున్న సంగతి గనించారు. ఎప్పటి నుంచే కొండ చిలువ గుడ్లు పెట్టే పనిలో ఉంది. ఓ మూల నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన అధికారులు.. మెల్లగా వెళ్లి చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. భారీ సర్పం వాళ్లకు చెమటలు పట్టించింది.
పైథాన్ చాలా పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. అందులోనూ గుడ్లు పెట్టే దశలో ఉన్నందని తెలుసుకున్నారు. ఇలాంటి టైంలో పట్టుకోవడానికి యత్నిస్తే పాము తిరగబడుతుందని ముందే ఊహించారు. అందుకే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు.
కోవెలకుంట్ల తాహసిల్దార్ ఆఫీస్‌కు చేరుకున్న ఫారెస్టు అధికారులు అక్కడి పరిస్థితి గమనించారు. వెంటనే స్నేక్ క్యాచర్లను రప్పించారు. పాము పూర్తిగా గుడ్లు పెట్టే వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత ఉచ్చు వేశారు. అనుకున్నట్టుగానే ఉచ్చులో కొండచిలువ చిక్కింది.
కొండచిలువ అయితే చిక్కింది కానీ… దాన్ని సంచిలో వేసేటప్పుడు మాత్రం ముప్పుతిప్పలు పెట్టింది. ఓ పట్టాన అది లొంగలేదు. ఛాన్స్ దొరికితే చాలు మనుషులపైకి తిరగబడింది. అతి కష్టమ్మీద ఆ కొండ చిలువను బంధించారు స్నేక్ క్యాచర్లు. గుడ్లను కూడా ఓ సంచిలో వేసి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇప్పటికే ఇంకా వేరే ప్రాంతాల్లో పాములు ఏమైనా ఉన్నాయా అన్న టెన్షన్ కోవెలకుంట్ల తాహసిల్దార్ ఏరియా ప్రజల్లో, అధికారుల్లో మొదలైంది.