Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. ప్రియురాలిని నడిరోడ్డుపై కత్తితో పొడిచిన ప్రియుడు

|

Jan 19, 2021 | 4:40 PM

Chittoor Murder: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని నడిరోడ్డుపై ప్రియుడు ఢిల్లీ బాబు కత్తితో దారుణంగా నరికి..

Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణం.. ప్రియురాలిని నడిరోడ్డుపై కత్తితో పొడిచిన ప్రియుడు
Follow us on

Chittoor Murder: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని నడిరోడ్డుపై ప్రియుడు ఢిల్లీ బాబు కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర గాయాలతో ప్రియురాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.

కాగా, గత నెల రెండో వారంలో బాబు, గాయత్రిలు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే యువతి తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమ జంటను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు పోలీసులు. యువతి తల్లిదండ్రుల వద్దే ఉంటానని తెలుపడంతో పోలీసులు వారిద్దరిని తిరిగి తమ ఇళ్లకు పంపించారు. దీంతో కక్ష పెంచుకున్న ఢిల్లీ బాబు మంగళవారం తన బంధువుల అమ్మాయితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న గాయత్రిని ఎంపరాళ్ల కొత్తూరు వద్ద బాబు అడ్డగించాడు. కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమె బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తమిళనాడులోని వేలూరు పీహెచ్‌సీకి తరలిస్తుంగా, మార్గమధ్యంలో గాయత్రి మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చింతమాకులపల్లిలోని ఢిల్లీ బాబు ఇంటిపై దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read:

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలో దారుణం.. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.. కారణం ఏంటంటే..