19ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యువతి.. మోక్షం కోసం విలాసాన్ని త్యజించి..

|

Jan 13, 2024 | 8:44 AM

ఈ సందర్బంగా యోగితాజీ సురానా మాట్లాడుతూ.. తనకు చిన్నతనం నుండి పైలట్, CA, లేదా IAS కావాలనే కోరికలు ఉండేవని చెప్పింది. కానీ, పెరుగుతున్న కొద్దీ తన కోరికలు, అభిరుచులు మారుతూ వచ్చాయని చెప్పింది. కోరికలకు అంతం లేదు. అందుకే తాను కోరికలు, ప్రాపంచిక సుఖాల నుండి దూరంగా ఉండాలని, అవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది. బయటకు వెళ్లి

19ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరుకు చెందిన యువతి.. మోక్షం కోసం విలాసాన్ని త్యజించి..
Monk Transformation
Follow us on

చిత్తూరుకు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ స్వర్ణకారుడి 19 ఏళ్ల గ్రాడ్యుయేట్ కుమార్తె శ్రీమతి యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసినిగా మారనున్నట్టు ప్రకటించారు. 19ఏళ్ల యువతి జైన సన్యాసినిగా మారుతున్నారు జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసిగా ఉండేందుకు నిర్ణించుకున్నట్లు యోగితాజీ సురానా శుక్రవరాం సోమాజిగూడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆమె తన తల్లిదండ్రులు పద్మరాజ్‌ సురానా, స్వప్న సురానా, జైన సామాజికవర్గ పెద్దలతో కలిసి మాట్లాడారు. ఈ నెల 16న సన్యాసినిగా మారనున్నట్లు వివరించారు. ఇకపై తమ కుమార్తె సాధారణ జీవితానికి, తమకూ దూరంగా ఉండనున్నారని ఆమె తల్లిదండ్రులు వివరించారు.

ఈ సందర్బంగా యోగితాజీ సురానా మాట్లాడుతూ.. తనకు చిన్నతనం నుండి పైలట్, CA, లేదా IAS కావాలనే కోరికలు ఉండేవని చెప్పింది. కానీ, పెరుగుతున్న కొద్దీ తన కోరికలు, అభిరుచులు మారుతూ వచ్చాయని చెప్పింది. కోరికలకు అంతం లేదు. అందుకే తాను కోరికలు, ప్రాపంచిక సుఖాల నుండి దూరంగా ఉండాలని, అవన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది. బయటకు వెళ్లి మోక్షం పొందాలనుకున్నాను. అందుకే సన్యాసిని అవుతున్నాను అని సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ యోగితా సూరన ప్రకటించారు.

ఇవి కూడా చదవండి