Tenth and Inter : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు.!

|

Jun 16, 2021 | 12:02 AM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు పడనుంది. ఆయా పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం..

Tenth and Inter : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు.!
Adimulapu Suresh
Follow us on

10th Inter exams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు పడనుంది. ఆయా పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు, జూలై చివరి వారంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించేందుకు పరిశీలనలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన అనంతరం పరీక్షలపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తామన్నారు. 2008 డీఎస్సీ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైయస్‌ జగన్‌ మానవతా దృక్పథంతో వ్యవహరించారని మంత్రి చెప్పుకొచ్చారు.

Read also : Jabardasth Hyper Aadi : వీడియో సందేశంలో తెలంగాణ ప్రజలను బహిరంగ క్షమాపణలు కోరిన జబర్దస్త్ ఫేం హైపర్ ఆది.!