Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విమానంలో నిరసన.. ఏకంగా రన్ వే పై పడుకుని..

|

Sep 13, 2023 | 1:18 PM

స్కిల్ డవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మూడు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా..

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా విమానంలో నిరసన.. ఏకంగా రన్ వే పై పడుకుని..
TDP Activist
Follow us on

స్కిల్ డవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మూడు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా.. ఆయన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను విడుదల చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త, చంద్రబాబు అభిమాని.. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఏకంగా విమానంలోనే నిరసన తెలిపాడు.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం వెళ్లే విమానంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరసనకు దిగడం కలకలం రేపింది. మంగళవారం విశాఖ విమానాశ్రయంలో టీడీపీ కార్యకర్త ఆడారి కిషోర్‌కుమార్‌ విమానంలోనే నిరసనకు దిగాడు. ఆ తర్వాత రన్ వే పై పడుకుని ఆందోళన చేపట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయింది. విమానంలో కిషోర్ కుమార్ ‘సేవ్ డెమోక్రసీ’ బ్యానర్‌ను పట్టుకుని కనిపించాడు. చంద్రబాబు అరెస్టుపై ఏపీ గవర్నర్ కలగజేసుకుని న్యాయం చేయాలని సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డు ప్రదర్శించాడు. దీంతో అతన్ని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిషోర్ మిషన్ కర్షక దేవోభవ అవగాహన సదస్సులు ముగించుకుని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో విశాఖపట్నం వచ్చాడు. అదే సమయంలో గవర్నర్ నజీర్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ఇదిలాఉంటే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేతను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించడాన్ని నిరసిస్తూ ఏపీలోని పలు జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 23 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆతర్వాత చంద్రబాబు తనను హౌస్ అరెస్ట్ చేయాలంటూ పిటీషన్ దాఖలు చేయగా.. కస్టడీ కోరుతూ సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో అమరావతి ఇన్నర్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణను 19కి వాయిదా వేసింది. అయితే, కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను విచారించిన కోర్టు 18 వరకు ఇవ్వొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై వాదోపవాదాలు వినాల్సి ఉందని పేర్కొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..