Andhra Pradesh: టంగుటూరులో రచ్చ రచ్చ.. ఓ వైపు చిరిగిన చొక్కాతో టీడీపీ ఎమ్మెల్యే.. మరోవైపు వైసీపీ నేతలు..

|

Jun 05, 2023 | 9:12 PM

Kondapi Politics: చిరిగిన చొక్కాతో నడిచిన ఉన్న ఈయన కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఇక ప్లాస్టిక్‌ చెంబులు చేతబట్టి.. నోట్లో వేప పుల్లలు పెట్టుకుని ర్యాలీ చేస్తూ.. చెట్ల మధ్య కనిపిస్తున్న వీళ్లంతా వైసీపీ నేతలు.. కార్యకర్తలు. వీరిలో కొండపి వైసీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు కూడా ఉన్నారు.

Andhra Pradesh: టంగుటూరులో రచ్చ రచ్చ.. ఓ వైపు చిరిగిన చొక్కాతో టీడీపీ ఎమ్మెల్యే.. మరోవైపు వైసీపీ నేతలు..
Kondapi Politics
Follow us on

Kondapi Politics: చిరిగిన చొక్కాతో నడిచిన ఉన్న ఈయన కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఇక ప్లాస్టిక్‌ చెంబులు చేతబట్టి.. నోట్లో వేప పుల్లలు పెట్టుకుని ర్యాలీ చేస్తూ.. చెట్ల మధ్య కనిపిస్తున్న వీళ్లంతా వైసీపీ నేతలు.. కార్యకర్తలు. వీరిలో కొండపి వైసీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు కూడా ఉన్నారు. ఈ పోటాపోటీ నిరసనలతో కొండపి నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. నాలుగేళ్లుగా రాజకీయ స్తబ్ధత ఉన్న కొండపిలో ఎన్నికల వేడో ఏమో.. పాత అంశాలు కొత్తగా సెగ పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్వామి.. మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారన్నది వైసీపీ ఇంఛార్జ్‌ అశోక్‌బాబు ఆరోపణ. నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి ఆయన టంగుటూరు నుంచి బయలుదేరడంతో పోలీసులు అశోక్‌బాబును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కానీ.. ఆయన పోలీసుల కళ్లుగప్పి.. అనుచరులను పోగేసి ఇలా చెంబులతో ర్యాలీ తీశారు.. ఆద్యంతం డ్రామా పండించారు.

వైసీపీ ఆఫీసు ముట్టడికి ఎమ్మెల్యే స్వామి పిలుపు

వైసీపీ నిరసన గురించి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే స్వామి కయ్యమన్నారు. టీడీపీ కేడర్‌తో కలిసి టంగుటూరులోని వైసీపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరారు. మధ్యలోనే ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. పార్టీతో కేడర్‌ ప్రతిఘటించింది. తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోయింది. గొడవ జరుగుతుండగానే మరో రూట్‌లో టంగుటూరువైపు పరుగులు పెట్టారు స్వామి. వెంబడించిన పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో ఎమ్మెల్యే రోడ్డుపైనే బైఠాయించారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికలే లక్ష్యంగా ఎత్తుగడలు

టీడీపీ ఎమ్మెల్యే స్వామితోపాటు వైసీపీ ఇంఛార్జ్ అశోక్‌బాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాకీలను అడ్డుకునేందుకు వైసీపీ కేడర్‌ ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తానికి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు ఆసక్తిగా మారుతున్నాయి.

కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి అరెస్టుపై చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్విట్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..