Nara Lokesh: భవిష్యత్ బాగుండాలంటే సైకో పోయి సైకిల్ రావాలి.. సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్..

|

Feb 05, 2023 | 5:41 PM

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. పాదయాత్రలో అందరికీ ముద్దులు...

Nara Lokesh: భవిష్యత్ బాగుండాలంటే సైకో పోయి సైకిల్ రావాలి.. సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్..
Nara Lokesh
Follow us on

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్‍.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యలు పరిష్కారిస్తామని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం అందిస్తామని స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ కు వెల్లడించారు. తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేశ్‍ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని లోకేశ్ స్పష్టం చేశారు.

నాడు – నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడం. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తాం. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్‍ కే దక్కింది.

           – నారా లోకేశ్, టీడీపీ లీడర్

ఇవి కూడా చదవండి

జగన్ అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదన్నారు నారా లోకేశ్. దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్యను జగన్‍ రద్దు చేశారని మండిపడ్డారు. ముస్లింలను ప్రయోజకులను చేయడానికే చంద్రబాబు విదేశీ విద్య ప్రవేశపెడితే.. జగన్‍ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని ఫైర్ అయ్యారు. ముస్లింలపై జరిగిన అన్యాయంపై ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..