TDP Leader: బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి.. టీడీపీకి మరోషాక్ తప్పదా?..

|

Jan 17, 2021 | 9:12 PM

TDP Leader: టీడీపీకి షాక్‌ ఇచ్చేందుకు మరో సీనియర్ నాయకురాలు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు..

TDP Leader: బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి.. టీడీపీకి మరోషాక్ తప్పదా?..
Follow us on

TDP Leader: టీడీపీకి షాక్‌ ఇచ్చేందుకు మరో సీనియర్ నాయకురాలు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెబుతున్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. పార్టీ మార్పు అంశంపై స్పందించారు. టీడీపీలో 33 ఏళ్లుగా ఉన్నానని, అనేక పదవులు కూడా పొందానని అన్నారు.

కానీ, ఇప్పుడు పార్టీ తనను వద్దనుకుంటోందని పడాల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అంశంపై మరోసారి కార్యకర్తలతో సమావేశమై.. తన భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తానని అన్నారు. గౌరవం లేని చోట ఉండటం కష్టమని అరుణ వాపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన పట్ల పార్టీ ఇలా వ్యవహరిస్తుందని ఊహించలేదన్నారు. ఇలాంటి పరిస్థితులే టీడీపీలో కొనసాగడంపై పునరాలోచనలో పడేసిందని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేత గద్దె బాబూరావు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Also read:

COVID-19 vaccine drive: రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్.. 17,072 మందికి టీకా..

Farmers Protest: ఆ రైతు సంఘాలు అలా అంటుంటే.. ఈ రైతు సంఘం ఇలా అంటోంది.. సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో?..