Chandra Babu Naidu Arrest: చంద్రబాబును వెంటాడుతున్న మరో కేసు.. అందులో కూడా ఏ1 గా ఉన్న బాబు

|

Sep 14, 2023 | 9:08 AM

స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుతో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలవడానికి పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 12:00 PM గంటలకు- ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

Chandra Babu Naidu Arrest: చంద్రబాబును వెంటాడుతున్న మరో కేసు.. అందులో కూడా ఏ1 గా ఉన్న బాబు
Chandrababu
Follow us on

స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుతో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలవడానికి పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 12:00 PM గంటలకు- ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబును మరో కేసు వెంటాడుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అంగుళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో వందలమంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ కేసుల్లో ఇప్పటికే చాలామందికి బెయిల్‌ దొరికింది.

అయితే, ఏ1గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టై ఆల్రెడీ జైల్లో ఉన్న చంద్రబాబుకి ఇప్పుడు ఈ కేసు కూడా టెన్షన్‌ పెడుతోంది. అయితే ఈరోజు ఏపీ హైకోర్టు దీనిపై విచారణ చేయనుంది. మరి, అంగుళ్లు కేసులో బాబుకి ఊరట లభిస్తుందా? లేదా?. ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక వరుస కేసులతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతేకాదు.. చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్యనేతల్ని కూడా కేసులు చుట్టుముట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి నారాయణ. అయితే ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు నారాయణ. అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు ఇటీవల టీడీపీ, జనసేన పార్టీల మధ్య అనుబంధం మరింత పెరిగిపోయింది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జనసేన ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వైసీపీపై తాను పోరాటం చేస్తానని అన్నారు పవన్ కల్యాణ్. బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయగా.. జనసేన సైతం మద్దతిచ్చింది. నారా లోకేష్‌కు ఫోన్ చేసి ముందుగానే పవన్ సంఘిభావం తెలిపారు. అదే సమయంలో.. లోకేష్ కూడా పవన్ కల్యాణ్ అన్నలాగా అండగా ఉన్నట్లు.. తాను ఒంటరి వాడ్ని కాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..