జగన్ నిర్ణయంపై స్వరూపానందేంద్ర హర్షం

|

Sep 10, 2020 | 10:08 PM

తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది నరసింహస్వామి గుడి రథం దగ్ధమైన కేసు విచారణను సీబీఐకి అప్పగించడంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం..

జగన్ నిర్ణయంపై స్వరూపానందేంద్ర హర్షం
Follow us on

తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది నరసింహస్వామి గుడి రథం దగ్ధమైన కేసు విచారణను సీబీఐకి అప్పగించడంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. సీబీఐ విచారణ ద్వారా అసలైన దోషులు, కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఘటనకు సంబంధించిన సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. అటు, తిరుమల తిరుపతి దేవస్థానంను కాగ్ పరిధిలోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమని కొనియాడారు. తాజాగా అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని కితాబిచ్చారు. ఇలాఉండగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీబీఐ విచారణను కోరుతూ హోంశాఖకు ఏపీ డీజీపీ కార్యాలయం లేఖ రాసిన సంగతి తెలిసిందే.