కరోనా నివారణకు కదిలిన చినజీయర్‌ స్వామి

| Edited By:

May 16, 2020 | 4:23 PM

ధర్మ రక్షణ కోసం శ్రీ రాముడు జన్మిస్తే.. ధర్మసేవ కోసం హనుమంతుడు అవతరించారని భక్తుల నమ్మకం. రావణ సంహారం కోసం జరిగిన యుద్ధంలో వానరసైన్యం నిస్తేజం అయినప్పుడు, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు.. వాయుపుత్రుడైన హనుమంతుడు సంజీవని తెచ్చి ప్రాణాలను రక్షించాడు. అయితే ప్రస్తుతం మానవాళి మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకు నిస్తేజమైపోయింది. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ కరాళ నృత్యం కొనసాగుతోంది. ఏ మూలచూసినా.. ఎక్కడచూసినా నిస్తేజం తాండవిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. లోకకళ్యాణార్ధం తనవంతు బాధ్యతగా కదిలారు […]

కరోనా నివారణకు కదిలిన చినజీయర్‌ స్వామి
Follow us on

ధర్మ రక్షణ కోసం శ్రీ రాముడు జన్మిస్తే.. ధర్మసేవ కోసం హనుమంతుడు అవతరించారని భక్తుల నమ్మకం. రావణ సంహారం కోసం జరిగిన యుద్ధంలో వానరసైన్యం నిస్తేజం అయినప్పుడు, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు.. వాయుపుత్రుడైన హనుమంతుడు సంజీవని తెచ్చి ప్రాణాలను రక్షించాడు. అయితే ప్రస్తుతం మానవాళి మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకు నిస్తేజమైపోయింది. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ కరాళ నృత్యం కొనసాగుతోంది. ఏ మూలచూసినా.. ఎక్కడచూసినా నిస్తేజం తాండవిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. లోకకళ్యాణార్ధం తనవంతు బాధ్యతగా కదిలారు చినజీయర్‌ స్వామి. కరోనా మహమ్మారి నివారణ కోసం శ్రీరామ జపం, హనుమత్‌ పారాయణం చేస్తున్నారు. హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణ, వానరసైన్యం ప్రాణాలు కాపాడినట్లు.. త్వరగా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారై ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. శ్రీరామ, హనుమత్‌ పారాయణాన్ని చేస్తున్నారు చినజీయర్‌ స్వామి. ఇందుకోసం మండల దీక్ష చేపడుతున్నారు. 40 రోజులపాటు సాగే ఈ మండల దీక్ష.. గురు పౌర్ణమి వరకు కొనసాగుతుంది. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఈ హనుమత్‌ పారాయణం జరుగుతోంది.