AP News: హమ్మయ్య.! చల్లటి కబురు.. విస్తరిస్తున్న రుతుపవనాలు.. రేపటి నుంచి వర్షాలు..!

వ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. మంగళవారం(జూన్ 20) నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

AP News: హమ్మయ్య.! చల్లటి కబురు.. విస్తరిస్తున్న రుతుపవనాలు.. రేపటి నుంచి వర్షాలు..!
Andhra Weather Update

Updated on: Jun 19, 2023 | 9:58 AM

తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. మంగళవారం(జూన్ 20) నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రస్తుతం శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటక, రత్నగిరి, కొప్పల్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న రుతుపవనాలు.. క్రమంగా కదులుతూ రాష్ట్రమంతటా విస్తరిస్తాయని పేర్కొంది. అటు అరేబియాలోని బిపర్‌జాయ్ తుఫాన్ బలహీనపడుతుండటంతో బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, కర్నూల్, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో చిరు జల్లులు కురుశాయని.. వచ్చే 24 గంటల్లో రాయలసీమలోని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. సోమవారం రాష్ట్రంలోని 23 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు, అలాగే మంగళవారం 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళలో అవసరమైతేనే తప్ప.. ప్రజలు బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.