తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ప్రయాణీకుల రద్దీ, దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) 10 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ స్పెషల్ ట్రైన్స్ 20, 21, 22, 23 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ రైలు అక్టోబర్ 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకీవిడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ట్రైన్ 22వ తేదీన సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ నెల 23వ తేదీన తిరుపతి నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట, జనగాం స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
కాచిగూడ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ ఈ నెల 21వ తేదీన రాత్రి 8.45 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు పూరి చేరుకుంటుంది. ఇక అటు నుంచి వచ్చే ట్రైన్ ఈ నెల 22వ తేదీన రాత్రి 10.45 గంటలకు పూరి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 8.45 గంటలకు కాచిగూడ చేరుతుంది. మల్కాజ్‌గిరి, కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి.
ఈ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 20వ తేదీన రాత్రి 8.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
ఈ ట్రైన్ తిరుపతి నుంచి అక్టోబర్ 21వ తేదీన రాత్రి 8.05 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుతుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ట్రైన్ 22వ తేదీన రాత్రి 8.10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు చేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, అకీవిడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
సికింద్రాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ ఈ నెల 22వ తేదీన రాత్రి 8.40 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు సంత్రగాచి చేరుకుంటుంది. ఇక అటు నుంచి వచ్చే ట్రైన్ ఈ నెల 23వ తేదీన రాత్రి 6.45 గంటలకు సంత్రగాచి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి.
కాగా, ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు.
In order to clear extra rush of passengers, arrange to run #Diwali #SpecialTrains between Secunderabad – Visakhapatnam,
Vishakapatnam – Tirupati, Tirupati – Secunderabad, with the following stoppages and timings, on the dates mentioned below: pic.twitter.com/R3Xnsz2s1O— South Central Railway (@SCRailwayIndia) October 19, 2022