అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 27: అదిగో చిరుతపులి.. అంటే ఇదిగో పెద్ద పులి.. నిన్న రాత్రి ఎలుగుబంటి.. ఇలా రోజు ఏదో ఒకటి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి… భయపెడుతున్నాయి. ఒక్కోసారి గ్రామం మొత్తం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఈ గ్రామాల్లో కనిపిస్తోంది. పాములు, కొండచిలువలు ఇళ్ళల్లోకి వస్తుండటంతో వణికిపోతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. దొర్ల వీధిలో రమణమ్మ అనే మహిళ ఉంటున్న గుడిసెలో దూరి భయపెట్టింది. 8 అడుగుల భారీ కొండచిలువను చూసి తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీసింది రమణమ్మ. స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించందంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. పామును రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.
గత ఏడాది వర్షాలు పడిన సమయంలో కూడా ఇదే పరిస్తితి కనిపించింది. భారీగా పాములు, అడవి జంతువులు ఇళ్ళల్లోకి వచ్చేశాయి. 12 అడుగుల కింగ్ కోబ్రా భయాందోళనకు గురి చేసింది. కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ,పేట గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా రావడంతో జనం తీవ్రంగా వణికిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి