Skeleton: ఉక్కునగరంలో ఆస్థిపంజరం కలకలం.. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు

|

Jul 04, 2023 | 7:02 AM

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఆస్తిపంజరం కలకలంపై దర్యాప్తు వేగవంతం చేశారా పోలీసులు. ఘటనా స్థలంలో లభించిన కత్తి, క్లూస్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హత్య..? ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడుని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.  

Skeleton: ఉక్కునగరంలో ఆస్థిపంజరం కలకలం.. శాంపిల్స్‌ను  ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
Vsp Steel Plant
Follow us on

విశాఖ గాజువాక ఉక్కునగరంలో శనివారం కలకలం సృష్టించిన ఆస్థిపంజరం కేసు మిస్టరీ చేదించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఘటనా స్థలంలో అస్తిపంజరం తో పాటు ఓ కత్తి కూడా ఉండడంతో హత్య జరిగి ఉంటుందా అన్న అనుమానం మొదలైంది. అస్తిపంజరం దగ్గర ఉన్న ఓ ప్యాంటులో బ్యాంకు ఏటీఎం కార్డ్, పర్సు లభించయి. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పర్సు, ఏటీఎం కార్డు సబ్బవరం చెందిన వ్యక్తిదిగా గుర్తించారు పోలీసులు. పోలీసులు విచారణలో భాగంగా..సబ్బవరం లో పర్సు గల వ్యక్తి బతికే ఉన్నట్టు తెలుసుకున్నారు. 2021లో పర్సు పోయినట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత డెబిట్ కార్డును బ్లాక్ చేయించినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది.

అయితే ఘటనా స్థలంలో లభించిన కత్తి ఆస్తిపంజరాన్ని చూసి చాలా మంది భయపడ్డారు. ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని అనుమానించారు. అయితే పోలీసులు మాత్రం దాన్ని నిర్ధారించలేదు. ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఓ వ్యక్తిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న నేరాలు చేస్తూ బతికే ఆ వ్యక్తి.. ఆస్తిపంజరంగా మారి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. గడనా స్థలంలో సేకరించిన నమూనాలను ల్యాబ్ కు పంపించారు.

Reporter : khaja

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..