నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో వర్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇంతకీ వర్మ, జగన్‌తో ఎందుకు సమావేశమయ్యారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో పేర్ని నానిని కలిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎంతో భేటీ వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే వర్మ బుధవారం సీఎం ఇంటివద్ద కలిసినట్లు తెలుస్తోంది. జగన్‌తో కలిసి వర్మ లంచ్ చేసినట్లు సమాచారం. అయితే వీరి భేటీ వెనక కారణంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే క్యాంప్ ఆఫీస్ వర్గాల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో ఈ భేటీ పూర్తిగా వర్మ వ్యక్తిగత విషయంగా తెలుస్తోంది. ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వర్మ.. ముఖ్యమంత్రిని కలిసే విషయాన్ని పంచుకోకపోవడం గమనార్హం. దీంతో ఇది వ్యక్తిగత భేటీ అనే వాదనలకు బలం చేకూరినట్లైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..