AP News: విషాదాంతమైన MPDO మిస్సింగ్ మిస్టరీ.. మృతదేహం లభ్యం..

గత ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆయన మృతదేహాన్ని.. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.

AP News:  విషాదాంతమైన MPDO మిస్సింగ్ మిస్టరీ.. మృతదేహం లభ్యం..
MPDO Venkataramana
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2024 | 11:48 AM

నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు.. మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. ఏలూరు కాలువలో ఆయన  మృతదేహం లభ్యమైంది. సెల్ లోకేషన్ మిస్సింగ్ అయిన ప్రాంతానికి 500 మిట్లర్ల దూరంలో మృతదేహాన్ని ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం MPDOగా పనిచేస్తున్న మండవ వెంకట రమణరావు.. విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. జులై 3వ తేదీ నుంచి సెలవు పెట్టిన ఆయన.. ఇటీవల కానూరులోని ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి లేటవుతుందని చెప్పాడు. నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్‌ చేశాడు.

అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు రాసిన సూసైడ్‌ నోట్‌ను కూడా తన సెల్‌ఫోన్‌ నుంచి ఫ్యామిలీ మెంబర్స్‌కు పంపించారు. అందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్ ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్‌ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్, సీసీ విజువల్స్ ఆధారంగా ఇన్ని రోజులు గాలింపు జరపగా తాజాగా ఆయన మృతదేహం లభ్యమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..