Atchutapuram Sarpanch: ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చేవారు బహుఅరుదు. కానీ కొంతమంది తాము ప్రజలకు ఏ వాగ్దాన్ని ఇచ్చి పదవి చేపట్టామో అది నెరవేర్చేవరకూ నిద్రపోరు.. అది నెరవేర్చేవరకూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏపీలో గత పంచాయితీ ఎన్నికల సమయంలో ఓ యువకుడు సర్పంచ్ గా పోటీ చేయడానికి ఎన్నికల్లో నిలబడ్డారు. గ్రామంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వేయించిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. రహదారి వేయించిన తర్వాతనే వివాహం చేసుకున్నారు.. అందరితోనూ ప్రసంశలు అందుకున్నారు.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జంగుళూరుకు చెందిన యువ సర్పంచ్ లాలం నాగేశ్వరరావు.
జంగుళూరు గ్రామానికి సరైన రహదారి లేదు.. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఈ నేపథ్యంలో 2013 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీచేసిన లాలం నాగేశ్వరరావు.. రోడ్డు నిర్మిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. రోడ్డు పూర్తిచేసే వరకూ తాను పెళ్లికూడా చేసుకోనని శపథం చేశారు.
ప్రజలు అతనికి గ్రామ పెద్దగా పట్టంగట్టారు.. తన మీద గ్రామస్థులు పెట్టుకున్న నమ్మకాన్ని నాగేశ్వరరావు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. సమస్యలను వివరిస్తూ.. అప్పటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు దృష్టికి తీసుకునివెళ్ళారు.. రమేష్ బాబు సానుకూలంగా స్పదించి గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.85 లక్షలు మంజూరు చేశారు. దీంతో నాగేశ్వరరావు రహదారి పనులు వేగంగా పూర్తి చేయించారు. తాను గ్రామానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసిన తర్వాత ఆయన కూడా పెళ్లి చేసుకున్నారు.
Also Read: ఏపీలో ఎన్నికల కోడ్ అమలు.. కొన్నిచోట్ల పట్టించుకోని అధికారులు.. స్వయంగా తహసీల్దార్ ఇళ్లపట్టాల పంపిణీ