ఏ ఎమ్మెల్యేకు సీఎం ఫోన్ చేశారు. ఏ మంత్రిని తిరిగి కొనసాగిస్తారు? సామాజిక, సీనియార్టీ లిస్ట్‌లో ఎవరు మంత్రి కాబోతున్నారు? ఏపీ మొత్తం ఇదే చర్చ. ఓ వైపు రాములోరి కళ్యాణం.. మరోవైపు నేతలకు పదవుల కేటాయింపుతో ఏపీ అంతా ఓ ప్రత్యేక వాతావారణం నెలకొంది. అయితే జగన్(CM Jagan) టీం 24లో ఎవరు ఉండబోతున్నారనే దానిపై.. ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో దీనికి సంబంధించిన గెజిట్ కూడా విడుదల కానుంది. ఆ తర్వాత రాత్రి 7గంటలకు కొత్త మంత్రుల లిస్ట్ సీల్డ్ కవర్‌లో గవర్నర్ దగ్గరకు చేరనుంది. మంత్రులుగా సెలక్ట్ అయిన వారికి సీఎం జగన్ నేరుగా ఫోన్ చేస్తున్నారు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ పెరిగింది.
ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి ఇంటికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లనున్నారు. మంత్రి వర్గంలో తనను కూడా కొనసాగిస్తారనే ఆశాభావంతో బాలినేని ఉన్నారు. అయితే అభ్యర్ధుల ఎంపిక ముగింపు దశకు చేరుకోవడంతో.. ఆయనకు టెన్షన్ ఎక్కువై హైబీపీ వచ్చింది. బాలినేనికి మంత్రి పదవి దాదాపు లేనట్టే. ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్‌కి పదవిని రెన్యువల్ చేసి.. తనకు చేయకపోవడంతో ఆయనకు బీపీ పీక్స్‌కి వెళ్లింది. ఈరోజు ఉదయం బాలినేనికి హైబీపీ రావడంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారాయన. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. ఆయనకు పదవి రాకపోవడంపై అనుచరులు కూడా గుర్రుగా ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలినేని ఇంటికెళ్లారు. ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. మంత్రి పదవి కాకున్నా.. పార్టీలో ప్రధాన్యతతోపాటు ఇతర పదవులకూ హామీ లభిస్తున్నట్లు సమాచారం.
మాచర్లలో టెన్షన్… టెన్షన్…
అధికారికంగా మంత్రుల తుది జాబితా విడుదలకు ముందే వైసీపీలో కలకలం రేగింది..పల్నాడు జిల్లా మాచర్లలో సమావేశమయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు..మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు భేటీ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి రాకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు.
Also Read: Andhra Pradesh: కొట్టంలో అర్ధరాత్రి పశువులు అరుపులు.. చూసేందుకు వెళ్లగా..