
ఏపీలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా కనిపించిన ఓ యువకుడికి.. మంత్రి క్లాస్ పీకారు.. కాస్ట్లీ బైక్ సరే.. హెల్మెట్ ఎక్కడ అంటూ మంత్రి సవిత.. ఆ యువకుడిని ప్రశ్నించారు. పెనుకొండలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరిగాయి. రోడ్డు భద్రత వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి సవితకు హెల్మెట్ లేకుండా బైక్ పై వెళుతున్న యువకుడు తారసపడ్డాడు.. సోమందేపల్లికి చెందిన సాయి అనే యువకుడు హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తుండగా.. మంత్రి సవిత ఆ యువకుడిని ఆపారు. బైక్ ఖరీదు ఎంత అని మంత్రి అడిగారు. దీంతో ఆ యువకుడు సమాధానం చెప్పాడు.. రెండున్నర లక్షల బైక్ ఓకే.. మరి హెల్మెట్ ఎక్కడ అంటూ యువకుడికి మంత్రి సవిత క్లాస్ పీకారు.
అంతేకాకుండా.. తల్లికి ఫోన్ చేయాలంటూ సూచించారు.. యువకుడి తల్లితో ఫోన్లో మాట్లాడిన మంత్రి సవిత.. పిల్లలకు ఖరీదైన బైక్ కొనివ్వడంతో సరిపోదని… హెల్మెట్ ధరించే బాధ్యత కూడా తీసుకోవాలని యువకుడు సాయి తల్లికి సూచించారు.. ప్రస్తుతానికి వదిలేస్తున్నామని.. ఇంకొకసారి హెల్మెట్ లేకుండా మీ అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తే… బైక్ సీజ్ చేస్తామని యువకుడి తల్లికి కూడా మంత్రి సవిత మందలించారు..
హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడికి అప్పటికప్పుడు హెల్మెట్ తెప్పించి.. యువకుడు తలకు హెల్మెట్ ధరించారు మంత్రి సవిత… ప్రతి ఒక్కరూ బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత ముఖ్యమని మంత్రి సవిత సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..