Viral: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ మెసేజ్.. అనుమానమొచ్చి నెంబర్‌కు ఫోన్ చేయగా షాక్..

|

Jun 25, 2022 | 1:34 PM

ఓ వ్యక్తికి 'కరెంట్ బిల్లు చెల్లించలేదు.. మీ విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి' అంటూ మెసేజ్...

Viral: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ మెసేజ్.. అనుమానమొచ్చి నెంబర్‌కు ఫోన్ చేయగా షాక్..
Current Bill
Follow us on

ఓ వ్యక్తికి ‘కరెంట్ బిల్లు చెల్లించలేదు.. మీ విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి’ అంటూ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఖంగుతిన్న సదరు వ్యక్తి.. వెంటనే ఆ మెసేజ్‌లో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేశాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలో సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి.

సైబర్ నేరగాళ్లు కొత్త దండాకు తెరలేపారు. ఓటీపీలు అడగట్లేదు. లింకులు సెండ్ చెయ్యట్లేదు. ఫోన్లు చేసి బ్యాంక్ డీటయిల్స్ చెప్పమనట్లేదు. రిమోట్ డెస్క్ యాప్‌ల ద్వారా అమాయకుల ఖాతాల నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో ఇదే తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనితో అప్రమత్తమైన విద్యుత్ విజిలెన్స్ అధికారులు.. ప్రజలను ఇలాంటి మోసాలను నమ్మొద్దని సూచిస్తున్నారు.

ఎనీ డెస్క్, టీం వ్యూయర్ లాంటి రిమోట్ దేక్స్ యాప్స్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిపై క్లిక్ చేయగానే.. మన ఫోన్‌లోని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ రిమోట్ డెస్క్ యాప్స్ ద్వారా మన మొబైల్‌లో జరిగే ప్రతీ విషయాన్ని వాళ్లు చూడగలరు.. తద్వారా మన బ్యాంక్ ఐడీ, పాస్‌వర్డ్స్ తెలుసుకోగలరు. కట్ చేస్తే.. నెక్స్ట్ మినిట్ ఖాతాల్లో నుంచి డబ్బులు దోచేస్తారు. కాగా, కరెంట్ బిల్లుల కోసం ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని.. బిల్లు చెల్లించకపోతే లాస్ట్ డేట్ దాటిన వెంటనే స్థానిక లైన్‌మాన్ వచ్చి నోటిసులు ఇస్తారని చెబుతున్నారు.