సినిమాను మించిన సీన్.. తాళికట్టే టైంకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన వరుడు!

సరిగ్గా తాళికట్టే సమయానికి అమ్మాయి ప్రేమించిన వ్యక్తి పెళ్లి మండపంలోకి రావడం.. అతన్ని చూసిన అమ్మాయి పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లడం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అయితే చాలా మంది ఇది సినిమాల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడో పెళ్లిలో అచ్చం ఇలాంటి సీనే రిపీట్ అయింది. సరిగ్గా తాళికట్టే సమయానికి ప్రేమించిన యువకుడు రావడంతో పెళ్లి కూతురు వెళ్లి అతని పక్కన నిల్చుంది. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో వెలుగు చూసింది.

సినిమాను మించిన సీన్.. తాళికట్టే టైంకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన వరుడు!
Ntr District Wedding Drama

Updated on: Mar 08, 2026 | 11:15 AM

ఎన్టీఆర్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో సినిమా తరహాలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాసేపైతే వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు అనే సమయానికి మండపంలోకి ఆమె ప్రేమించిన యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. అది చూసిన పెళ్లి కూతురు.. పీటల మీద నుంచి లేచి నేరుగా మండపంలో నిల్చున్న తన ప్రేమికుడి పక్కన నిల్చుంది. అది చూసిన పెళ్లి కొడుకు, మండపంలోని బంధువులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. ఇంతలోనే పెళ్లి కూతురు మాట్లాడుతూ అతను తమ గ్రామానికి చెందిన వాడే.. అతన్ని తాను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో కాసేపు పెళ్లమండపంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నారు.

అయితే పెళ్లి మధ్యలో వచ్చి వివాహాన్ని ఆపేయడంతో కొందరు పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. మధ్యలో వచ్చి పెళ్లిని ఆపినందుకు సదురు యువకుడిపై చేయిచేసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత చేదాటిపోయింది. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అక్కడ పెళ్లి మాత్రం జరగలేదు.

అయితే పీట మీదనే పెళ్లి ఆగిపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉన్నదే ఒక్క కుమారుడని.. అతని పెళ్లిని ఘనంగా చేయాలని బంధుమిత్రులను అందిరిని పిలిచామని తెలిపారు. పెళ్లి కోసం దాదాపుగా రూ.20లక్షల వరకు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. అన్ని సవ్యంగా జరిగాయని ఆనంద పడేలోపే ఇలా వచ్చి తమ పరువు తీశారని మండిపడ్డారు. అనంతరం రెండు వర్గాలు పంచాయతీ పెట్టుకొని సమస్యను పరిష్కరించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us