
విజయవాడ, జూన్ 29: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు తాజాగా పౌరసరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
MDU విధానం అమలులో ఉన్నపుడు ఈ-ఫోన్లో ఉన్న సాఫ్ట్‌వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీషనర్ సౌరబ్ర్తో కలిసి సందర్శించారు. ఈ-ఫోన్‌లో లాగిన్ నుంచి కార్డు నెంబరు ఎంటర్ అయ్యే విధానం కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో MDU వాహనం ఎపుడు వస్తుందో, వెళుతుందో తెలియని దుస్థితి ఉందని అన్నారు. దీంతో కార్డుదారులు రేషన్ కోసం.. వాహనం కోసం.. రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింన్నారు. ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో ఒకటో తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మద్యహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాల్లోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు.
65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృద్దులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారీగా సిద్ధం చేశామని, వారికి 1 నుంచి 5వ తేదిలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చెప్పారు. రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికోత్తయాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ యాప్‌లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు. యంఎల్ఎస్ పాయంట్ నుంచి సరుకు ఎంత వచ్చింది.. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే.. వివరాలు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.