Monsoon alert: అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలే వర్షలు..

అండమాన్‌ను తాకాయి. కేరళ తీరాన్ని తాకడానికి ముందే.. నాలుగైదు రోజుల్లో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో

Monsoon alert: అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలే వర్షలు..
Rains

Updated on: May 17, 2022 | 7:02 AM

నైరుతి రుతుపవనాలు చాలా స్పీడుగా ఉన్నాయి. అండమాన్‌ను తాకాయి. కేరళ తీరాన్ని తాకడానికి ముందే.. నాలుగైదు రోజుల్లో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) స్పష్టంచేసింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ . ఫలితంగా.. వ్యవసాయ ఆధారిత దేశానికి ఎంతో కీలకమైన నాలుగు నెలల వర్షాకాల సీజన్​ ప్రారంభం అయింది. నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

మరో రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు మొత్తానికి, బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

లక్షద్వీప్, ఉత్తర తమిళనాడు తీరం వెంట సైక్లోనిక్ సర్కులేషన్ కారణంగా.. కేరళ సహా కర్ణాటక తీర ప్రాంతాలు, దక్షిణ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఐఎండీ.

సాధారణంగా ఏటా జూన్​ 1కి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరతాయి. అయితే.. అసని తుపాను కారణంగా ఐదు రోజులు ముందే, అంటే మే 27న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఇటీవలే ఐఎండీ ప్రకటించింది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ సహా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్​కు చేరువకాగా.. జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నైరుతు రుతుపవనాల ముందస్తు రాకతో.. వర్షాలు రానున్నాయనే సమాచారంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us