
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
ఇక రాయలసీమకు కూడా అమరావతి వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. వర్షాల క్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటివరకు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం దక్కింది.