
ఆంధప్రదేశ్‌కు రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. ఏపీలో నాలుగు నగరాల్లో మోగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. విశాఖపట్నంతో పాటు అమరావతి, తిరుపతి, గన్నవరంలో వీటి నిర్మాణానికి మొగ్గు చూపింది. వీటి నిర్మాణానికి భూమి కేటాయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని రైల్వేశాఖ కోరగా.. కూటమి సర్కార్ కూడా అంగీకరించింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేయగా.. భూమి కేటాయించాక రైల్వేశాఖ పనులను మొదలుపెట్టనుంది. ఈ టెర్మినల్స్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. సమీపంలోని పెద్ద స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు రైళ్ల నిర్వహణ కూడా సులభతరం అవుతుంది. ఈ మెగా కోచింగ్ టెర్మినల్స్ బాధ్యతలను రైల్వేశాఖనే చూసుకోనుంది.
రైలు బయల్దేరే స్టేషన్ లేదా తిరిగి చేరుకునే స్టేషన్ ఒక్కటే అవ్వడం వల్ల ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి పడుతుంది. వాటికి సమీపంలో ఈ మెగా టెర్మినల్స్‌ను నిర్మిస్తారు. ఇక్కడే రైళ్ల మెయింటెనెన్స్ పనులు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఇక విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లు ఎప్పుడూ ప్రయాణికులతో విపరీతమైన రద్దీతో ఉంటాయి. దీంతో రాష్ట్రంలోని ఈ ప్రధాన రైల్వే స్టేషన్లకు సమీపంలో ఈ మెగా టెర్మినల్స్ నిర్మించనున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు సుబ్బవరం మండలం జగన్నాథపురం వద్ద మెగా టెర్మినల్ నిర్మించేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం 500 ఎకరాల స్థలం సేకరించనున్నారు.
ఇక విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినల్స్ నిర్మించనున్నారు. ఎర్రుబాలెం-నంబూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ రెడీ అవుతుంది. అందుకే అమరావతి దగ్గర నిర్మించే టెర్మినల్ కోసం 300 ఎకరాలు, గన్నవరం టెర్మినల్ కోసం 145 ఎకరాలు అవసరం అవుతుందని రైల్వేశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు భూమిని సేకరించి అందించాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ప్రపొజల్ పెట్టింది. ఇక తిరుపతి మెగా టెర్మినల్‌కు సంబంధించి రేణిగుంట సమీపంలో ఉండనుంది. తిరుపతి-రేణిగుంట మధ్య ఈ టెర్మినల్ ఉంటుంది. దీని వల్ల తిరుపతి రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములు కేటాయిస్తే అంత త్వరగా రైల్వేశాఖ పనులు ప్రారంభించనుంది. ఈ టెర్మినల్స్‌లో రైళ్ల మెయింటనెన్స్ పనులు నిర్వహిస్తారు. ఈ మెగా టెర్మినల్స్ రాకతో ఏపీలో రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయి. దీని వల్ల రాష్ట్రానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం కూడా భూమి కేటాయించేందుకు ముందుకు రావడంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. రైల్వేశాఖ కూడా డెడ్ లైన్ నిర్దేశించుకుని వీటిని త్వరతగతిన పూర్తి చేయాలని భావిస్తోంది.